పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉత్పత్తుల్లోని ప్రధానమైన అరకు స్టాల్ అందుబాటులోకి వచ్చింది. రెండు అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. సోమవారం లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్లో కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించి రుచి చూశారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు పలువురు పాల్గొన్నారు.