ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2022 ఏప్రిల్ 30న మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.
మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే.. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. జనరల్ మనోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో విధుల్లో చేరారు. 39 ఏళ్ల కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.
ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖను (LAC) ఈ కమాండ్ మోహరించింది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. లెఫ్టినెంట్ జనరల్ పాండే తూర్పు కమాండ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు.