Delhi Intelligence Sources : అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు: ఇంటెలిజెన్స్ సోర్సెస్
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను అలర్ట్ చేసినట్టు సమాచారం. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ఆయనకు ముప్పు ఉందని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అటు ఆప్, ఇటు కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్‌కు Z-కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేడు హనుమాన్ మందిరంలో పూజలు చేశాక ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.
నామినేషన్లకు ముందు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను విచారించే ముందు ఈడీ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబర్లో సూచించిన సంగతి తెలిసిందే. కాగా తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీ ఆరోపిస్తున్నారు.
కాగా.. 2024 మార్చి 21న కేజ్రీవాల్‌ను ED మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఇదే కేసులో జూన్ 26న CBI కూడా రంగంలోకి దిగి అవినీతి కేసులో అరెస్టు చేసింది. చివరికి సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిలిచ్చింది. ఈకేసులో మనీష్ సిసోడియా 17 నెలలపాటు జైల్లో ఉన్నారు.