ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు ఓటర్లను ఆకట్టు కునేందుకు రకరకాల హామీలిస్తున్నా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ నిరుద్యోగులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్య లు చేశారు. ఐదేండ్లలో నిరుద్యోగాన్ని అంతమొందిస్తానని ఆయన చెప్పారు. ఈ విషయా లపై ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు. యువతకు ఉపాధి కల్పిం చడమే తన ప్రాధాన్యత అని అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తాము ఒక ప్రణాళిక రూపొందించా మని చెప్పారు. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ప్ర భుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించిందని వివరించారు. ఉపాధి ఎలా సృష్టించాలో తమకు బాగా తెలుసునన్నారు. ప్రజల మద్దతుతో మళ్లీ అధికారం లోకి వస్తే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానంటూ భరోసా ఇచ్చారు.