Arvind Kejriwal : అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్.. భద్రతపై ఆందోళన

Update: 2024-09-19 12:45 GMT

జైలు నుంచి వచ్చాక ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో తన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇంటితో పాటు అన్నిరకాల సౌకర్యాలను వదులుకునేందు కు సిద్ధమయ్యారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు.

ఐతే.. కేజ్రీవాల్ భద్రతపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారం రోజుల్లోగా కేజ్రీవాల్ అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. అంతే కాకుండా.. ప్రభుత్వం కల్పించిన అన్నిరకాల వసతులను వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. కొత్త ఇంటి కోసం అన్వేషణ జరుగుతోంది.

కేజీవాల్ ప్రజల మనిషి అనీ.. ఆయన ఢిల్లీవాసులతో కలిసి జీవించాలని అనుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న నివాసం ఆయనకు సరైన భద్రత కల్పిస్తోంది. ఇప్పుడు ఆయన బయటకు రాబోతున్నారనీ.. కేజీవాల్ భద్రతపై మేమంతా ఆందోళన చెందుతున్నాం అని అని సంజయ్ సింగ్ చెప్పారు.

Tags:    

Similar News