దేశమంతటా సకాలంలో పూర్తికావాల్సిన ఎన్నికలపై ఈసీ నజర్ పెట్టింది. జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ ( Election Commission ) ఈ నెలలో ప్రకటన చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్లో సానుకూల వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ కసరత్తు సాగిస్తోంది.
ఆగస్ట్ ద్వితీయార్థంలో ఎన్నికలను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ప్రజలు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం సానుకూల సంకేతంగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈసీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది.
గుర్తింపు పొందని నమోదిత పార్టీలను వారు ఎంచుకునే ఎన్నికల చిహ్నాల కోసం దరఖాస్తు చేయాలని ఈసీ ఆహ్వానించింది. ఈ పార్టీలు ఉమ్మడి ఎన్నికల గుర్తుపై తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు వెసులుబాటు కల్పించేలా ఈ చర్యలు చేపట్టింది.