Atishi : ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రిగా ఆతిశి.. పొలిటికల్ కెరీర్ సాగిందిలా!

Update: 2024-09-19 04:45 GMT

అతిశీ 1981 జూన్ 8న జన్మించారు. తల్లిదండ్రు లు విజయ్ సింగ్, త్రిప్తా వాహి ఢిల్లీ వర్సిటీలో ప్రొఫె సర్లు, మార్క్స్, లెనిన్ కలయికతో ఆమెకు అతి మా క్లీనా అని పేరుపెట్టారు. ఆతిశి ఢిల్లీలోని స్ప్రింగేల్స్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సే యింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి 2021లో డిగ్రీ పట్టా అందుకున్న ఆమె, చీవ్నింగ్ స్కాలర్షిప్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 2003లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి రోడ్స్ స్కాలర్ గా పనిచేశారు. కొంతకాలం ఆంధ్ర ప్రదేశ్లోని రిశివ్యాలీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు.

2005లో ఆక్స్ఫర్డ్ లోని మాగ్డాలెన్ కాలేజీ లో టీచర్ గా కెరీర్ను ప్రారంభించిన ఆతిశి మార్లేనా కాలక్రమంలో సామాజిక కార్యకర్తగా, ఎంపీగా మంచి పేరు తెచ్చుకున్నారు. కేజీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ లో కీలక వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభు త్వంలో విద్యా, పీడబ్ల్యూడీ, కల్చర్, ఫైనాన్స్, టూరిజం శాఖల మంత్రిగా ఉన్నారు. ఆప్ పొలిటికల్ అఫైర్స్ క మిటీలో సభ్యురాలిగా ఉన్నారు. మనీశ్ సిసోడియా అ రెస్ట్ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం నుంచి క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. 2013లో పార్టీ ప్రాథమిక పాల సీలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతానికి ఆప్ ప్రతినిధిగా, ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో పార్టీకి సారథిగా వ్యవహరిం చారు. 2015 జులై నుంచి 2018 ఏప్రిల్ వరకు విద్యాశాఖ సలహాదారుగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి గెలుపొందారు. 2023 మార్చి 9న కేజీ కేబినెట్లో చోటు దక్కించుకుంది. ఏకైక మహిళా మంత్రిగా ఆర్థిక, ఎడ్యుకేషన్, పబ్లిక్ వర్క్స్, పవర్, రెవెన్యూ, లా, ప్లానింగ్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ, విజిలెన్స్ శాఖల బాధ్యతలు చేపట్టారు.

ఇంతకు ముందు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పని చేశారు. షీలా దీక్షిత్ ఎక్కువ కాలం సీఎంగా పని చేయగా, బీజేపీ దివంగత నాయకురాలు

సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ 12 నుంచి.. అదే సంవత్సరం డిసెంబర్ 3 వరకు అంటే దాదాపు 52 రోజుల పాటు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. షీలా దీక్షిత్ 1992 డిసెంబర్ 3 నుంచి 2023 ..డిసెంబర్ 28 వరకు 15 సంవ త్సరాల 25 రోజుల పాటు సీఎంగా సేవలం దించారు. కేజీవాల్ తర్వాత ఆప్ నుంచి తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశి కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News