Ayodhya : దీపావళి వేళ అయోధ్య మరో రికార్డ్

Update: 2024-10-30 08:45 GMT

శ్రీరాముడు కొలువైన అయోధ్య నగరం మరో రికార్డు క్రియేట్ చేయబోతోంది. అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. దీపాల వెలుగులో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్‌ కీ పైడీతో సహా 55 ఘాట్‌ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది. దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్‌ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లేజర్ షో, బాణసంచా, రాంలీలా ‍ప్రదర్శనలు ఉంటాయి. జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సరయూ ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించనున్నారు. పాత రికార్డును బ్రేక్‌ చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కొత్త రికార్డు నమోదుకానుంది. 

Tags:    

Similar News