Salman Khan- Sharukh khan: సల్మాన్ -షారుఖ్‌ల గొడవ.. ఒక్క మీటింగ్‌తో ముగించిన బాబా సిద్ధిఖీ
ఎలాగంటే ?;
మహారాష్ట్రలో కీలక నేత బాబా సిద్దిఖీ దారుణ హత్య ఘటనతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన రాజకీయ నేత మాత్రమే కాదు..బాలీవుడ్ లో ఎన్నో సమస్యలను పరిష్కరించిన మధ్యవర్తిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. సల్మాన్-షారుక్ ఖాన్ మధ్య వివాదాన్ని పరిష్కరించింది బాబా సిద్దిఖీనే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ వయస్సు 66 ఏండ్లు. బాబా సిద్దిఖీ ఒక రాజకీయనేత, మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు..బాలీవుడ్ లో మధ్యవర్తిగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ ల మధ్య నెలకున్న కోల్డ్ వార్ ను బాబా సిద్దిఖీ అంతం చేసిన విధానం గురించి నేటికీ చాలా మంది చర్చించుకుంటున్నారు.
అసలు విషయం ఏంటంటే
2013లో బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా వీరిద్ధరి మధ్య విభేదాలు వచ్చాని చెబుతుంటారు. బాలీవుడ్ మొత్తం రెండు వర్గాలు వీడిపోయింది. సల్మాన్ షారుఖ్ మధ్య ఈ పవర్ ఫైట్ గురించి నిర్మాతలు కూడా ఆందోళన చెందారు. ఈ విషయం బాబా సిద్దిఖీ వరకు చేరింది. ఆయన సపోర్టు కావాలని కొంతమంది సినీ ప్రముఖులు ఆయన్ను అడిగారు. దీంతో సల్మాన్‌ను, షారుఖ్‌ను ఇఫ్తార్ విందుకు ఇన్‌వైట్ చేశాడు సిద్ధిఖీ. ఈ ఈవెంట్‌లో షారుఖ్ మొదట రాగా.. అనంతరం సల్మాన్ ఖాన్ వస్తాడు. అయితే సల్మాన్ ఖాన్‌ను చూసి షారుఖ్ లేచి హగ్ ఇవ్వడంతో అందరూ సంతోషంతో ఊగిపోయారు. అయితే ఇదే సమయంలో బాబా సిద్ధిఖీ వచ్చి వాళ్లిద్దరిని హగ్ చేసుకుని వారి మధ్య ఉన్న కోల్డ్ వార్ని ముగించడమే కాకుండా, ఇద్దరు ఖాన్‌లను మళ్లీ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారే విధంగా చేశారు! దీంతో అప్పటినుంచి సల్మాన్ ఖాన్ అంటే షారుఖ్‌కు, షారుఖ్ అంటే సల్మాన్‌కు విపరీతమైన గౌరవం పెరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.