Pakistan : 'ఆత్మహుతి దాడి వెనుక భారత్​ హస్తం'- సంచలన ఆరోపణలు!

ఈ పేలుళ్ల వెనక ‘రా’ ప్రమేయం ఉందని ఆరోపించిన పాక్;

Update: 2023-10-01 06:15 GMT

పాకిస్థాన్​లో జరిగిన అతి భయానక ఆత్మహుతి దాడి వెనుక భారత్​ హస్తం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇండియాకు చెందిన రా.. తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని పేర్కొంది. భారత్​పై పాకిస్థాన్​ మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది. బలూచిస్థాన్​లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఆత్మహుతి దాడి వెనుక భారత్​ హస్తం ఉందని ఆరోపించింది. రా (రీసెర్చ్​ అండ్​ వింగ్​ ఎనాలసిస్​).. తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని అన్నారు పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్​ బుగ్తి. 

నిత్యం సరిహద్దు గొడవలతోఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్‌పై పాకిస్థాన్  మరోసారి చలన ఆరోపణలే దీనికి కారణం. శుక్రవారం తమ దేశంలో జరిగిన రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ  ప్రమేయం ఉందని శనివారం పాకిస్థాన్ ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో శనివారం మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం  ప్రమేయం ఉందని పేర్కొన్నారు. "సివిల్, మిలిటరీ, అన్ని ఇతర సంస్థలు సంయుక్తంగా మస్తుంగ్ ఆత్మాహుతి బాంబు దాడిలో పాల్గొన్న అంశాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తాయి. ఆత్మాహుతి దాడిలో RAW ప్రమేయం ఉంది" అని పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు. పాక్ మంత్రి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రానున్న కాలంలో రెండు దేశాల పెను దుమారాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. మరోవైపు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్‌ఎను విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులు శనివారం నివేదికను సమర్పించారు. ఇక శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 65కు చేరింది.   


ఈ ఘటనపై విచారణ జరిపించి, ఆధారాలు సేకరిస్తామని వివరించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ నిందితుడిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో ఇండియా- పాక్ మధ్య పెనుదుమారం రేపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ లోని మస్తుంగ్ జిల్లాలో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదు దగ్గర్లో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.

దీంతో శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన 60 మంది పౌరులు చనిపోయారు. అదేసమయంలో ఖైబర్ ఫఖ్తున్ ఖ్వాలోని హంగూలో జరిగిన మరో సూసైడ్ అటాక్ లో ఐదుగురు మరణించారు. ఈ రెండు ఘటనలలో మొత్తం వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులను ఖండించిన బలూచిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం.. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ ఈ దాడులపై విచారణ జరుపుతోంది. 


Tags:    

Similar News