Red Fort: ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు..
ఢిల్లీ, గురుగ్రామ్‌లో అలర్ట్ !;
ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని అక్రమ వలసదారులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితులంతా 20 నుంచి 25 ఏండ్ల వయస్సులోపువారేనని చెప్పారు. ఢిల్లీలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారివద్ద బంగ్లాదేశ్‌కు సంబంధించిన పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తాజాగా సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో ఐదుగురు బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎర్రకోట ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండే ఈ యువకులు ఢిల్లీలో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసే సమయంలో వారి వద్ద బంగ్లాదేశ్‌కు సంబంధించిన పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని ఢిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే మరోవైపు హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో శనివారం మరో పది మంది బంగ్లాదేశీ అక్రమ నివాసితులు పోలీసులు దాడుల్లో పట్టుబడ్డారు. వీరి వద్ద కూడా బంగ్లాదేశీ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు లభ్యమయ్యాయని గురుగ్రామ్ పోలీస్ పీఆర్‌వో సందీప్ కుమార్ వెల్లడించారు. వీరిపై చర్యలు ప్రారంభమయ్యాయని, డిపోర్టేషన్ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. గత కొద్దికాలంగా తలెత్తుతున్న ఈ తరహా అక్రమ వలసదారుల అరెస్టులు జాతీయ భద్రత పరంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో నివసిస్తూ, చట్టబద్ధమైన పత్రాలేమీ లేకుండా సంచరిస్తుండటం స్థానికులలో భయాందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు దళాలు విస్తృత తనిఖీలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.