బర్త్‌డేకు బాహుబలి సమోసా ..!
యూపీలోని మీరట్‌లో సమోసా కోసం ఎగబడుతున్న జనం;
బర్త్‌డేకు ఎవరైనా కేక్ కట్ చేస్తారు. కానీ యూపీలోని మీరట్‌లో మాత్రం సమోసా కోసం ఎగబడుతున్నారు. అవును. లాల్‌కుర్తీ ప్రాంతానికి చెందిన కౌశల్ స్వీట్స్ షాపులో 12 కిలోల బాహుబలి సమోసాకు భారీ గిరాకీ పెరిగింది. పుట్టిన రోజు కోసం ఏకంగా 40 నుంచి 50 ఆర్డర్లు ఇచ్చారంటే ఈ బాహుబలి సమోసాకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ సమోసాను ముగ్గురు వంట మనుషులు ఆరు గంటల పాటు శ్రమించి తయారు చేశారు. దీని ఖరీదు 15 వందల రూపాయలు. అంతేకాదు.. అరగంటలో ఈ భారీ సమోసాను తింటే 71 వేల రూపాయల నగదును బహుబతిగా ఇస్తామని షాపు యాజమాని తెలిపారు. యూపీలోని ఈ బాహుబలి సమోసా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.