Delhi : బిగ్ షాక్ .. మనీశ్, కేజీపై ఈడీ విచారణ!

Update: 2025-01-15 16:00 GMT

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఈ విచారణ జరగనుంది. మనీలాండ రింగ్లో వారి ప్రమేయంపై ఈడీ ప్రాసిక్యూట్ చేయనుంది. ఢిల్లీ ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకోవ డం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధుల్ని విచా రించాలంటే ఈడీ ముందుగా అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు గతేడాది నవంబర్లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజీవాలు విచారించేందుకు ఈడీ గత నెల లెఫ్టినెం ట్ గవర్నర్ వీకే సక్సేనా ను అనుమతి కోరింది. ఈడీ అభ్యర్థనకు ఎల్జీ ఆమోదం తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఈడీ అధికారులు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లగా.. కేజీని విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేజ్రివాల్తోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ను కూడా విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News