Bill Gates : "సంపన్నుల జాబితా నుండి బయటకు వచ్చేస్తా" : బిల్ గేట్స్

Bill Gates : త్వరలోనే సంపన్నుల జాబితా నుంచి బయటకు వచ్చేస్తానని బిల్‌గేట్స్ ప్రకటించారు.

Update: 2022-07-15 06:23 GMT

Bill Gates : ''నేను సంపన్నుల జాబితాలో ఇక ఉండదలచుకోలేదు.. త్వరలోనే నా బిల్‌గేట్స్ చారిటీ ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్లు విరాళం ఇవ్వనున్నాను'' అని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రకటించారు.

బిల్‌గేట్స్‌కు గేట్స్ నోట్స్ అనే బ్లాగ్ ఉంది. అందులో ఆయన చేపడుతున్న, చేపట్టబోయే సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారు. గత రెండు దశాబ్దాలుగా బిల్‌గేట్స్ ప్రతీ ఏటా 6 బిలియన్ డాలర్లును సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ వచ్చారు. 2026 నాటికి 9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసే దిశగా పనిచేస్తున్నట్లు గేట్స్ చెప్పుకొచ్చారు.

కరోనా కాలంలో బిల్‌గేట్స్ సేవలు వర్ణించలేని. వేల కోట్లను ఆయన ఖర్చు చేశారు. భారత్‌లో కోవిడ్ షీల్డ్ తయారు చేయడానికి కూడా ఆయన మొదట్లో కొంత విరాళం ఇచ్చారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ 113 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. 217 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నారు. త్వరలోనే ఈ జాబితా నుంచి బయటకు వస్తానని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News