Biocon Chief Kiran Mazumdar : కోవిడ్ వ్యాక్సిన్లపై నిందలు వేయొద్దు .. బయోకాన్ చీఫ్ కౌంటర్
కోవిడ్ వ్యాక్సిన్లపై నిందలు వేయొద్దని, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదారా అన్నారు. హసన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలకు కొవిడ్ టీకాల ప్రభావమే కారణం కావొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ బయోకాన్ చీఫ్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సీఎం వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నా యన్నారు.‘ఇండియాలో అభివృద్ధి చేసిన కొవిడ్ 19 వ్యాక్సిన్లు అత్యవసర వినియోగ అధికార చట్టం కింద ఆమోదించడం జరిగింది. భద్రత, సమర్థత కోసం ప్రపంచ ప్రమాణాలకు అను గుణంగానే ఇది తయారైంది. ఈ వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు. ఇవి లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. ప్ర జలపై దుష్పరిణామాలు సంభవించిన కేసులు చాలా అరుదుగా చోటుచేసుకున్నాయి. ఈ వ్యాక్సిన్లపై నిందలు వేయడం మానేసి దాని అభి వృద్ధి వెనక ఉన్న సైన్స్ను గుర్తించడం చాలా ముఖ్యం' అని కిరణ్ ముంజుదారా అన్నారు. గత నెలలోనే హసన్ జిల్లాలో గుండెపోటుతో 20 మందికి పైగా మరణించడం పై సిద్ధరామ య్య ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్ వ్యాక్సిన్ల ను ప్రజలకు తొందరపాటుగా ఆమోదించడం, పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.