BJP MLAs : పాక్ పౌరులను వెళ్లగొట్టండి.. బీజేపీ ఎమ్మెల్యేల వినతి

Update: 2025-05-06 16:45 GMT

పహాల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచిపోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభు త్వం కఠినంగా అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పాక్ పౌరసత్వం ఉన్న వ్యక్తుల ను వెళ్లగొట్టాలని ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్యకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మా ట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పాక్ పౌరసత్వం, చెల్లుబాటు కానీ వీసాలతో నివసించే వారిని గుర్తించి వారిని బహి ష్కరించాలని సీపీకి సూచించామన్నారు. గతంలో నిజామాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నగర అంతర్గత శాంతి భద్రతల కు విఘతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం పాలిత రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదన్నారు. దీని మూలాన ఉగ్ర వాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుంద ని ఎమ్మెల్యేలు తెలిపారు. తెలంగాణ వ్యా ప్తంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News