BJP New National President : బీజేపీకి నెలాఖరుకు కొత్త దళపతి ఎంపిక

Update: 2025-04-02 10:15 GMT

భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల కొత్త అధ్యక్షుడి నియామకంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎల్లుండితో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఆ వెంటనే కొత్త సారథి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్ఠానం ప్రారంభిస్తుందని భాజపా వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 19 రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన తర్వాత, జాతీయ అధ్యక్షు డి ఎన్నిక ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే 13 రాష్ట్రాల్లో పార్టీ సంస్థా గత ఎన్నికలు పూర్తిచేసి అధ్యక్షుల పేర్లను ప్రకటించిన హైకమాండ్, మిగతా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా పార్టీ అధ్యక్షుల ఎంపికను పూర్తిచేయనుంది. బీజేపీలో సంస్థాగత ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతాయి. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రెండవ టర్మ్ 2024 జూన్ తో ముగిసింది. అయినప్పటికీ కేంద్ర మంత్రిగా, జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చేపట్టాలంటే, దేశంలోని 50శాతం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవ్వాలి. మరోవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికలో సామాజిక, రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని, కీలకమైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు మోడీ, షా ద్వయం కసరత్తు చేస్తున్నారు.

Tags:    

Similar News