కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌నకు షాక్ తగిలింది. ఆప్ అభ్యర్థి ప్రేమ్ లతపై బీజేపీ అభ్యర్థి హర్‌ప్రీత్ కౌర్ బబ్లా గెలిచారు. కాషాయ పార్టీకి 19 ఓట్లు రాగా, ఆప్‌కి 17 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు బబ్లాను మేయర్‌గా ప్రకటించారు. ఈ ఎన్నికలు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్ పర్యవేక్షణలో జరిగాయి. కాగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం.
గత ఏడాది ఫిబ్రవరి 20న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నాడు సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపును తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించి, వీడియో చూసిన తర్వాత ఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్‌ను మందలించి, షోకాజ్ నోటీసు జారీ చేశారు.