ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రావత్(68) మృతి చెందారు. వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమె కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. శైలా 2012లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో అప్పటి సీఎం హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా మారి బీజేపీ లో చేరారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాగా ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘కేదార్‌నాథ్ అసెంబ్లీ నుండి ప్రముఖ ఎమ్మెల్యే శ్రీమతి శైలా రాణి రావత్ జీ మరణించారనే అత్యంత బాధాకరమైన వార్త వచ్చింది. ఆమె నిష్క్రమణ పార్టీకి, ప్రజలకు తీరని లోటు. కర్తవ్య దీక్ష, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’ అని సిఎం పుష్కర్ సింగ్ ధామి రాసుకొచ్చారు.