Puri Ratna Bhandar : పూరీ రత్నభాండాగారంలో అంతులేని సంపద!

Update: 2024-07-17 09:37 GMT

పూరీ జగన్నాథుని రత్నభాండాగారంలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయని టాక్ నడుస్తోంది. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు అనేకంగా ఉన్నాయని సమాచారం. తాజాగా రత్నభాండాగారం అడుగున మరో రహస్య గది ఉందంటోన్న చరిత్రకారులు, ఆ గదిలోకి సొరంగమార్గం ద్వారా వెళ్లొచ్చని తెలుస్తోంది. ఆ గదిలోనూ వెలకట్టలేని స్వామివారి సంపద ఉందని చరిత్ర చెబుతోంది. అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంటున్నారు.

గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువై ఉన్నాయని చెబుతున్నారు అక్కడకు 1902లో బ్రిటీష్ పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని పంపించి విఫలం అయ్యారని చరిత్రకారులు అంటున్నారు. అలనాటి రాజులు యుద్ధాలు చేసి ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించారని చరిత్రకారులు భావనగా ఉంది. భాండాగారం దిగువన సొరంగమార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మాణం చేపట్టారు.

ఆ రహస్య గదిని తెరవాలని.. అందులోని సంపదను కూడా లెక్కించాలనీ చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు గదులను తెరిచి అందులోని సంపదను చంగడా గోపురానికి తరలించారు. ఇక మూడోగదిని ఎప్పుడు తెరవాలన్నదానిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుతం రత్నభాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News