ఏప్రిల్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 19 మంది కూలీలను సహాయక సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు. 19 మంది కూలీల్లో ఇద్దరు తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.
గాయపడిన కూలీలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ధ్రువ కాంత్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే మార్కెట్ యజమాని, కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గాయపడిన కార్మికులకు సాధ్యమైనంత మంచి చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.