ఉత్తర భారతాన వర్షాలు దంచికొడుతుంటే వాయవ్య, మధ్య భారతదేశంలో మాత్రం హీట్‌వేవ్ హడలెత్తిస్తోంది. విదర్భ, దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వడగాలుల వీచే ఛాన్సుంది కాబట్టి, బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.