Bypolls : ఏడు రాష్ట్రలలో జులై 10న ఉపఎన్నికలు: ఎన్నికల సంఘం
ఉపఎన్నికలు జులై 15 లోగా పూర్తికావాలన్న ఎన్నికల సంఘం;
ఏడు రాష్ట్రల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జూలై 10న నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం సోమవా రం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామా లేదా మరణం వల్ల ఖాళీ అ యిన ఈ స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది. నామినేషన్ల దాఖలు కు ఈ నెల 21 ఆఖరు తేదీ అని వెల్లడించింది. జూలై 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, జూలై 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
బీహార్ (1), పశ్చిమబెంగాల్ (4), తమిళనాడు(1), మధ్యప్రదేశ్(1), ఉత్తరాఖండ్(2), పంజాబ్(1), హిమాచల్ ప్రదేశ్(3). జులై 10న వీటికి ఉపఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు జులై 13న జరుగనున్నది.
ఉపఎన్నికల షెడ్యూల్:
నామినేషన్ ల దాఖలు చివరి తేదీ: జూన్ 21
నామినేషన్ల పరిశీలన: జూన్ 24
అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ: జూన్ 26
పోలింగ్ తేదీ: జులై 10
ఫలితాలు: జులై 13