Mumbai : డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. కొన్ని నిమిషాలకే సముద్రంలో..

Update: 2025-07-09 12:45 GMT

ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిన్నర్‌కు ఇంటికి వస్తున్నా.. అని తల్లికి ఫోన్‌లో చెప్పిన కొన్ని నిమిషాలకే ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. నవీ ముంబైలోని కలంబోలికి చెందిన డాక్టర్ ఓంకార్ కవితాకే గత ఆరేళ్లుగా ప్రతిష్ఠాత్మక జేజే ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన అటల్ సేతు వంతెనపై నుంచి దూకడాన్ని ఓ వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వంతెనపై ఆగి ఉన్న డాక్టర్ కారును గుర్తించారు. కారులోనే ఆయన ఫోన్ కూడా లభించింది. దీంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నడన్నదానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Tags:    

Similar News