DSP To Constable: డీఎస్పీని కానిస్టేబుల్‌గా డిమోట్ చేశారు: ఎందుకంటే?
మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధమే కారణం;
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అయితే మహిళా కానిస్టేబుల్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేండ్ల తర్వాత ఇదంతా జరగడం గమనార్హం. కృపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి ఎదిగాడు. కాగా, 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో కుటుంబ కారణాలు చెప్పి లీవ్ పెట్టారు. ఇంటికి వెళ్లాడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో భర్త ఇంటికి రాకపోవగా, ఫోన్లు కలువకపోవడంతో ఏం జరిగిందోనని భయపడిపోయిన అతని భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే ఫోన్ లొకేషన్ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా గడుపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్‌లో ఉండటాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీతోపాటు ఇతర ఆధారాలు సేకరించిన అధికారులు.. అతడిపై క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఇందులో భాగంగా డీఎస్పీగా ఉన్న అతడిని గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబులరీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోట్ చేశారు.