నీట్-యూజీ పేపర్ లీకేజీ ( NEET - UG Paper Leak ) గుట్టు విప్పే పనిలో సీబీఐ దూకుడును పెంచింది. పేపర్ లీకేజీపై నిజనిర్ధారణ చేపట్టేందుకు సీబీఐ తీవ్ర కసరత్తు జరుపుతోంది. ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
లీకేజీని నిర్ధారించేందుకు మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు చేపట్టాలని, ఇందుకోసం 1,000 మందిని విచారించేందుకు సీబీఐ కార్యాచరణ రూపొందించుకున్నట్లు సమాచారం. సాక్ష్యాలను సేకరించేందుకు తన బృందాలను బీహార్, గుజరాత్లోని గోద్రాలకు పంపింది. సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు దశల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పరీక్ష పత్రాల తయారీ, ముద్రణ నుంచి దేశవ్యాప్తం వివిధ పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేయడం.. ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. గోప్యతను కాపాడుకోవడానికి కఠినమైన ప్రోటోకాల్ ను ఉన్నప్పటికీ.. పరీక్షా పత్రాల తయారీ, ముద్రణ, రవాణా, పరీక్షల ప్రారంభానికి ముందు భద్రపరచడంలో ఎక్కడ తప్పులు జరిగాయన్నది సీబీఐ నిర్ధారించి దోషులను కోర్టు సాయంతో శిక్షించే చాన్సుంది.