Kishan Reddy : ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలి : కిషన్ రెడ్డి
Kishan Reddy : హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.;
Kishan Reddy : హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలని అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసి ప్రధాని తరపున ఆహ్వానం అందిస్తానన్నారు.
కేవలం ఆగస్ట్ 15, జనవరి 26నే కాకుండా.. భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ ప్రతి రోజు గౌరవించాలన్నారు కిషన్ రెడ్డి. ప్రతి పోస్ట్ ఆఫీసులో జాతీయ జెండాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.