చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 కేజీల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.