NTA Reforms: నీట్ వ్యవహారంలో తల్లిదండ్రుల సలహా కోరిన కేంద్రం..
సంస్కరణలు, సలహాల కోసం వెబ్‌సైట్ ప్రారంభం;
నీట్, యూజీసీ-నెట్ పరీక్షా పత్రాలు లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పారదర్శకతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌టీఏ పనితీరు, పారదర్శకతపై కేంద్రం ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్, నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏని ఎలా సంస్కరించాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి కేంద్రం సలహాలు కోరింది. వెబ్‌సైట్ – https://innovateindia.mygov.in/examination-reforms-nta/ ద్వారా సూచనలను సలహాలను స్వీకరించనుంది. జూలై 07 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చINDIA Bloc NEET exam row NTA
ఇటీవల నీట్, యూజీసీ – నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ నెట్ పేపర్ డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షం కావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అవకతవకలపై నిరసన తెలియజేస్తోంది. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నీట్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రధాన సూత్రధారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం జూన్ 22న కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తుండగా.. దిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కె.రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటీ దిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.