IndiGo : ఇండిగోకు కేంద్రం షాక్.. వాళ్లంతా సైలెంట్

Update: 2025-12-10 12:30 GMT

ఇండిగో సంస్థకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకున్న చర్యలతో దేశమంతా ప్రశంసలు అందుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మొన్నటిదాకా రామ్మోహన్ నాయుడుని బాగా టార్గెట్ చేసిన ఆర్నబ్ గోస్వామి, ఇతర కక్షపూరిత నేషనల్ మీడియాలు, వక్రబుద్ధి వైసిపి నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అదేంటి ఇండిగో సంస్థ తప్పు చేస్తే రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేసి మరీ తిట్టారు కదా. ఇప్పుడు అదే ఇండిగో సంస్థపై రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకుంటే ఎందుకు ప్రశంసించట్లేదు. కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నారు కూటమి నేతలు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డిజిసిఏ రూల్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. ఈ విషయాలు తెలియక చాలామంది డిజిసిఏ కొత్త రూల్స్ వల్లే ఈ సమస్య వచ్చిందని పొరపాటు పడుతున్నారు. ఈ రూల్స్ ను ఈ ఏడాది మొదట్లోనే డీజీసీఏ ప్రవేశపెట్టింది.

జూలై నుంచి మొదటి ఫేస్ రూల్స్ అమలులోకి వచ్చాయి. డిసెంబర్ నుంచి 2 విడత రూల్స్ అమలు కావాల్సి ఉంది. మరి జూలై నుంచి రూల్స్ అమలు అవుతున్నా సరే ఎలాంటి ఇబ్బందులు రాలేవు కదా. ఒకవేళ డీజీసీఏ రూల్స్ మరీ అంత కఠిన తరంగా ఉంటే అప్పటినుంచి ఈ సమస్య రావాలి. అప్పుడు ఇండిగో నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేవు. కానీ సెకండ్ ఫేస్ రూల్స్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. ఇండిగో సంస్థ సరిగ్గా రోస్టర్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని కేంద్ర విమాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా పార్లమెంట్ లో ప్రకటించారు. రూల్స్ కు తగ్గట్టు తాము సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని అందుకే సమస్య తలెత్తిందని ఇండిగో కూడా అంగీకరించింది.

ఇంత పెద్ద సంక్షోభం ఇండిగో వల్ల రావటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. విమానశాఖ ఇప్పుడు ఇండిగోకు పెద్ద షాకిచ్చింది. శీతాకాల సర్వీసుల్లో 5 శాతం ఇండిగో సంస్థకు కోత విధించింది. అంటే 100కు పైగా విమాన సర్వీసులను ఇండిగోకు రద్దు చేసింది. ఆ సర్వీసులను వేరే విమాన సంస్థకు అప్పగించేందుకు రెడీ అయింది. ఒకే సంస్థకు ఎక్కువ వాటా ఉండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని ఇప్పుడు మరిన్ని విమాన సంస్థలను ఆహ్వానించేందుకు కేంద్రం సిద్ధమైంది. అంటే రాబోయే కాలంలో ఇండియాలో ఇండిగో షేర్ తగ్గిపోనుంది. మరి ఇంత కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా అదే నేషనల్ మీడియా, అదే ఆర్నబ్ గోస్వామి ఎందుకు మౌనంగా ఉన్నారు. వైసిపి ఎందుకు సైలెంట్ అయింది. విమర్శలు చేసినప్పుడు ప్రశంసలు కూడా అందించాలి కదా. దీన్నిబట్టే వాళ్ళ కుట్రపూరిత కోణం బయటపడుతుంది.

Tags:    

Similar News