Chennai Rains : వణుకుతున్న చెన్నై.. మరో రెండురోజులు వర్షసూచన

Update: 2024-10-17 08:15 GMT

తమిళనాడు రాష్ట్రం చెన్నై ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 17, 18 తేదీల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వరదముప్పు వాటిల్లుతుందని చెన్నై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. చెన్నై జిల్లాతో పాటు తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకూ అత్యంతభారీ వర్షసూచన కొనసాగుతోంది.

ఇవాళ తెల్లవారుజామున వాయుగుండం తడ వద్ద తీరందాటం, ఆ తరువాత అది బలహీనపడిందన్న వార్తలు కాస్త ఊరట ఇచ్చాయి. ఉదయం నుంచి చెన్నైలో భారీ వర్షషాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోన అతిభారీ వర్షాలు కురిసే అవకాశ ముందని వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. చెన్నై జిల్లాతో పాటు చుట్టుపక్కలున్న మొత్తం 9 జిల్లాలకు, పుదుచ్చేరికి హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలుంటాయని తెలిపారు. ఆ తర్వాత 20 వరకు అన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదవవచ్చని ప్రకటించారు.

చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదవడంతో వరద పోటెత్తింది. ప్రధానంగా పొన్నేరి నియోజకవర్గంలో చోళవరం, పొన్నేరి, రెడ్‌హిల్స్‌లో ఊహించనంతగా వరద వచ్చింది. జనజీవనం స్తంభించింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ప్రాంతంలో కత్తివాక్కం, మణలి, కొలత్తూరు, పెరుంబూరు, అయపాక్కంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 19చోట్ల అతిభారీ, 5 చోట్ల భారీ వర్షాలు కురిశాయి

Tags:    

Similar News