Chennai: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన రైలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..
Chennai: చెన్నై బీచ్ స్టేషన్‌లో సబర్బన్ రైలు.. ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది.;
Chennai: చెన్నై బీచ్ స్టేషన్‌లో సబర్బన్ రైలు.. ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో.. నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్‌ను తాకింది. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులు..భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. రైల్‌లో ఉన్న పలువురు బయటకు దూకారు. ఆదివారం సెలవు దినం కావటం, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన రైలు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు