Road Accident: వివాహ వేడుకకు వెళ్తి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

నలుగురు చిన్నారులు సహా 13 మంది దుర్మరణం;

Update: 2025-05-12 01:00 GMT

వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో డీసీఎం వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ చోటు చేసుకున్నది. రాయ్‌పూర్‌ -బలోదబజార్‌ రోడ్డులోని సారగావ్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు మృతిచెందారు. వివాహ వేడుకకు హాజరై తిరిగి చౌతియా నుంచి చత్తీ తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మద్ సింగ్ తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారిని వెంటనే రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

చటౌడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బన్సారీ గ్రామానికి వెళ్లిందని పోలీసు అధికారులు తెలిపారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రక్కు ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సారగావ్ సమీపంలో డీసీఎం వ్యాన్‌ని ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత, పోలీసు బృందాన్ని సంఘటన స్థలానికి పంపామని, గాయపడిన వారిని రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించామని రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ తెలిపారు. జిల్లా పరిపాలన అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్, ఎస్పీ వివరించారు.

Tags:    

Similar News