UPSC సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1,129 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 1,009 మంది క్వాలిఫై అయ్యారు. 2024 జూన్ 16న ప్రిలిమ్స్, SEP 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆల్ ఇండియాలో శక్తి దూబే, హర్షిత గోయల్ తొలి రెండు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థి సాయి శివాణి 11వ ర్యాంక్ తెచ్చుకున్నారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ.సాయి శివాని 11వ ర్యాంకుతో మెరవగా.. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో అదరగొట్టారు.