CJI: మహిళల గౌరవాన్ని తగ్గించే మూస పదాలు వద్దు

కోర్టు తీర్పుల సమయంలో అనుచిత పదాలు వాడకుండా ఉండేందుకు హ్యాండ్‌బుక్‌... విడుదల చేసిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌;

Update: 2023-08-17 04:45 GMT

న్యాయస్థానాల్లో మహిళల పట్ల లింగ వివక్ష లేకుండా చూసే విషయంలో కీలక ముందడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళల ప్రస్తావనలో వాడాల్సిన పదాలు, వాక్యాలకు సంబంధించి( pleadings, orders, and judgments) సుప్రీం కోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్(CJI Chandrachud) కొత్త హ్యాండ్ బుక్‌(Unveils Handbook )ను రిలీజ్ చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత పదాలు వాడకుండా( gender unjust terms ) ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేసింది.

గత తీర్పుల్లో వాడిన మూసపదాలు మహిళల గౌరవాన్ని తగ్గించేవిగా ఉ‍న్నాయని సీజేఐ పేర్కొన్నారు. తీర్పుల్లో న్యాయమూర్తులు వాడిన పదాలు సమాజంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయని గుర్తు చేశారు. హ్యాండ్‌బుక్‌ ఆన్‌ కంబాటింగ్‌ జెండర్‌ స్టీరియోటైప్స్‌’ పేరుతో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.


వేశ్య, పతిత, విధేయత గల భార్య వంటి దాదాపు 40 పదాలను తొలగిస్తూ కొత్త హ్యాండ్ బుక్‌ను విడుదల చేసింది. మహిళలకు సంబంధించిన తీర్పుల్లో ఇకపై న్యాయమూర్తులు సున్నితమైన పదజాలాన్ని(suggests alternative words) ఉపయోగించనున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో మహిళల పట్ల ఉపయోగిస్తున్న మూసపదాలను తొలగిస్తూ హ్యాండ్‌ బుక్‌ను అప్‌లోడ్ చేశారు. అత్యాచారం, వేధింపులతో సహా మహిళలకు ముడిపడి ఉన్న కేసుల్లో ఇకపై సున్నితమైన పదజాలాన్ని వాడనున్నారు. మూస పదాల స్థానంలో ఆ పదాల మానసిక స్థితిని తీర్పుల్లో పేర్కొనాలని సుప్రీంకోర్టు హ్యాండ్‌ బుక్‌లో స్పష్టం చేసింది.

న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను ఈ హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్నారు. కోర్టు తీర్పుల్లో మహిళలపై వివక్ష చూపే విధంగా వాడే పదాలు సరైనవి కావని. ఆ తీర్పులను విమర్శించడం ఈ పుస్తకం ఉద్దేశం కాదని CJI స్పష్టం చేశారు.


లింగ వివక్షకు నిర్వచనం, న్యాయాధికారుల్లో అవగాహన పెంచడమే ఈ హ్యాండ్‌బుక్‌ లక్ష్యమని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. మహిళలపై మూసధోరణిలో వాడే పదాలను గుర్తించేందుకు న్యాయమూర్తులకు ఇది ఉపయోగపడుతుందన్నారు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. తీర్పుల్లో విషయాన్ని తెలపడానికి న్యాయమూర్తులు మహిళల పట్ల వాడే కొన్ని పదాలు లింగ వివక్షకు దారితీస్తున్నాయన్న CJI.... ఇది వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తోందన్నారు.

Tags:    

Similar News