Ballari : నిద్రిస్తున్న విద్యార్థులపై కత్తి, రాడ్లతో దాడి.. ఒకరు మృతి,

కర్నాటకలో దారుణం..

Update: 2026-03-08 06:00 GMT

కర్నాటక రాష్ట్రంలో( Karnataka)దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..బళ్లారిలోని(Ballari) గురుకుల వసతి గృహంలో నిద్రిస్తున్న విద్యార్థులపై పదో తరగతి చదువుతున్న విద్యార్థి కత్తి, రాడ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏపీలోని కర్నూలుకు చెందిన హేమంత్ కుమార్‌ మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. దాడిని అడ్డుకున్న హాస్టల్‌ వార్డెన్‌, సెక్యురిటీపై సదరు విద్యార్థి దాడికి పాల్పడి పారిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గోపాల్‌ గ్రామస్తుడిగా గుర్తించారు. కాగా, డ్రగ్స్‌కు బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడని బాలుడి తల్లిదండ్రులు ఆరపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News