CM Revanth : ప్రధాని మోడీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

Update: 2025-08-02 13:45 GMT

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీనీ ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించేందుకు అప్పట్లో వాజపేయి ప్రయత్నించారని.. అలాగే ప్రధాని పదవి నుండి తప్పించేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయత్నించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని మోహన్ భగవత్ సూచించినప్పటికీ మోదీ అందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. ఇతర బీజేపీ నేతలకు వర్తించిన రూల్స్ మోదీకి వర్తించవా అని ప్రశ్నించారు. ఐతే ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడడం చర్చకు దారి తీసింది.

Tags:    

Similar News