ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 62 రూపాయలు పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1,802 రూపాయలకు చేరింది. 5 కేజీల ప్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర 15 రూపాయలు పెరిగింది. 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను మాత్రం మార్చలేదు. పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం వల్ల హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర చిన్న బిజినెస్ లపై ప్రభావం పడనుంది. అక్టోబర్ 1న కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 48.50 రూపాయలు, 5 కేజీల సిలిండర్ ధరను 12 రూపాయలు పెంచాయి. ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి.