Assam: అసోంలో బీభత్సం సృష్టిస్తోన్న వరదలు.. నీట మునిగిన వందల గ్రామాలు..

Assam: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.

Update: 2022-05-18 13:30 GMT

Assam: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వందల గ్రామాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయడం ఏర్పడింది. కొండ చరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బనడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. న్యూ హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. వరదనీరు పోటెత్తడంతో రెండు రైళ్లు మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నార్త్‌ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

20 జిల్లాల్లోని 652 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2 లక్షల మందిపై భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదల కారణంగా 57 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి. 55 తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి.. బాధితులను అక్కడకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అసోం ప్రభుత్వం తెలిపింది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి

Tags:    

Similar News