పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల సరళిని మార్చాలని డిమాండ్ చేస్తూ బీహార్‌లో పోటీ పరీక్షల ఆశావహులు ఆందోళనకు దిగారు. డిసెంబర్ 13న బీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షల్లో ఒక పూట ఒకే పేపర్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఖాన్, రెహ్మాన్ ఖాన్ వంటి కొందరు ప్రముఖ విద్యావేత్తలు మద్దతుపలికారు. విద్యార్థులు ఎంత చెప్పినా కూడా వినకుండా బీపీఎస్సీ ఆఫీసులోకి వెళ్లేందుకు దూసుకెళ్లారు. ఆందోళనకారులపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయడం వివాదాస్పదమైంది.