BJP Leader Dr. K. Laxman : కాంగ్రెస్ చరిత్ర అంతా కులగణనకు వ్యతిరేకం

Update: 2025-05-01 11:00 GMT

కాంగ్రెస్ పార్టీ చరిత్రంతా కుల గణనకు వ్యతిరేకమేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఓబీసీలపై మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటోకు పాలాభిషేకం చేశారు. డప్పు వాయిద్యాలతో సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కులాల పేరిట రిజర్వేషన్లు వద్దన్నారని చెప్పారు. మండలి కమిషనన్ ను కాంగ్రెస్ వ్యతి రేకించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడు దీనిపై ఆలోచన చేయలేదని, దేశంలో 90 ఏళ్ల తర్వాత కులగణన జరుగుతుందన్నారు. రేవంత్ డీఎన్ఏలో కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్ గురించి ఆయన తెలుసుకోవాలన్నారు. రేవంత్ సర్కార్ చేసిన సర్వే రాజకీయ కోణంలో ఓట్ల కోసమే చేసిందని ఆరోపించారు. ఆ సర్వే పూర్తి వివరాలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రం ఎవరి ఒత్తిడికి తలొగ్గలేద ని, శాస్త్రీయ పద్ధతిలో, లీగల్ సాంటిటీ ఉండేలా జనగణనలో కులగణన చేయబోతున్నారని వె ల్లడించారు.

Tags:    

Similar News