Chidambaram : కాంగ్రెస్ కు అధికారం కష్టమే : చిదంబరం

Update: 2025-05-17 09:45 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని, ఆ పార్టీ కోసం చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయని మాజీ కేంద్రం మంత్రి చిదంబరం అన్నారు. 2029 లోనూ ఇండియా కూటమి ప్రతిపక్ష స్థానంలో నే ఉంటుందని, ఈ విషయం రాహుల్ గాంధీ సన్నిహితులకు కూడా తెలుసని అన్నారు. రెండు ప్రధానమైన రాజ్యాంగ సంస్థలు బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయని ఆరోపించా రు. అందులో మొదటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. భారతదేశంలో ఎన్నికలు జరిగితే అధికార పక్షానికి 98% ఓట్లతో ఏ పార్టీ కూడా గెలవదని అన్నారు. ఇక్కడి పరిస్థితులు వేరని చెప్పారు. ప్రతిపక్షాని కి 20 నుంచి 24% ఓట్లు వస్తాయని తెలిపారు. ఇండియా కూటమిలో లుకలుకలు కూటమి అతుకులు కదులుతున్నట్టు, దారాలు ఊడి పోతున్నట్టు కనిపిస్తోందని చిదంబరం అన్నారు. దానిని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉందని, తిరిగి బలోపేతం చేయ వచ్చని వ్యాఖ్యానించారు. కూటమిలోని భా గస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, కీలకమైన సమావేశాలు జర గకపోవడం వంటి అంశాలపై ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు తరచూ సమావేశమవుతూ వ్యూహరచన చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ, ఇండియా కూటమిలో అలాంటి ప్రయత్నా లు కొరవడ్డాయని చిదంబరం పరోక్షంగా సూచించారు.

Tags:    

Similar News