Congress MP Sudha Ramakrishnan : కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేసిన దుండగుడు

Update: 2025-08-04 11:45 GMT

చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే బంగారం లాక్కెళ్తున్నారు. ఒక్కోసారి ఈ ఘటనల్లో మహిళలు తీవ్రంగా గాయాలపాలవుతున్నారు. తాజాగా ఓ మహిళా ఎంపీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్‌ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని చైన్ కొట్టేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకే లీడర్ రజతితో కలిసి పోలాండ్ ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

చైన్ దొంగతనంపై ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా లేఖ రాశారు. ‘‘ వాకింగ్ చేస్తుండగా హెల్మెట్‌ పెట్టుకొని స్కూటీ మీద వచ్చిన ఒక వ్యక్తి.. నా మెడలోని గోల్డ్ చైన్ లాక్కొని పారిపోయాడు. బండిపై నిదానంగా వస్తుండటంతో అతడిని చైన్‌ స్నాచర్‌గా అనుమానించలేదు. అతడు బలంగా చైన్ లాగడంతో నా మెడమీద గాయాలయ్యాయి. ఇలాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఎంపీగా ఉన్న ఒక మహిళపై జరిగిన ఈ దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రదేశంలోనే ఒక మహిళ సురక్షితంగా నడిచే పరిస్థితి లేకపోతే.. ఇక ఇతర ప్రాంతాల్లో రోజూవారీ పనులను మేం ఎలా ధైర్యంగా పూర్తి చేసుకోగలం..? అంటూ లేఖలో ఆమె ప్రశ్నించారు.

Tags:    

Similar News