లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో గెలిచేందుకు కావాల్సిన మద్దతు తమకు లేదని తెలిసినా కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థిని నిలిపింది. అయితే గెలుపోటములు ముఖ్యం కాదని, సభ సంప్రదాయాన్ని గుర్తు చేయడానికే పోటీలో ఉన్నామని అంటోంది. గత 2 పర్యాయాల్లో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చినా ఎందుకివ్వరని ప్రశ్నిస్తోంది. ఆనవాయితీ ప్రకారం 10% సీట్లు పొందిన తమకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలంటోంది
లోక్‌సభ స్పీకర్ పదవికి కావాల్సిన ఎంపీల మద్దతు NDA అభ్యర్థి ఓం బిర్లాకు ఉంది. ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 240 ఓట్లు ఉన్నాయి. NDA భాగస్వామ్య పార్టీల ఓట్లు 53, వైసీపీ ఓట్లు 4తో కలిపి మొత్తం 297 ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్షమైన ఇండియా కూటమికి 233 మంది ఎంపీల మద్దతు ఉంది. రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది సభ్యులున్నారు. దీని ప్రకారం కావాల్సిన ఓట్లు 271.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో NDA అభ్యర్థి ఓం బిర్లాకు YCP మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ YV సుబ్బారెడ్డి ప్రకటించారు. ఓం బిర్లాకు మద్దతివ్వాలని NDA అగ్రనేతలు YCP అధినాయకత్వాన్ని కోరారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా NDAకు మద్దతిస్తున్నామన్నారు. స్పీకర్ పదవి కోసం TDP పట్టుబడితే మద్దతిస్తామన్న కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. అందుకే ఇండియా కూటమికి మద్దతివ్వట్లేదన్నారు.