ఎన్నికల్లో ఖర్చు చేసే నిధులు.. బ్లాక్ మనీపై దేశమంతటా చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ఎలక్టోరల్ బాండ్ల ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్లతో పార్టీలకు వచ్చిన డబ్బుల గురించే చర్చ నడుస్తుంది.
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం తో ఆ వివరాల జాబితాలు బయటకు వస్తున్నాయి. బీజేపీ కే వేలాది కోట్లు విరాళాలుగా ఇచ్చినట్లు నివేదికలో బయటపడుతున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా.. ఎలక్టోరల్ బాండ్ల ఫై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎలక్టోరల్ బాండ్స్‌తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు. ఎలక్టోరల్ బాండ్ (Electoral Bonds) ఇష్యూకు సంబంధించి, భారత సుప్రీంకోర్టు నిర్ణయాలను అమిత్ షా అంగీకరించారు. అయితే, కోర్టు తీర్పుతో ఎన్నికల నిధుల్లోకి నల్లధనం వెనక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్ల వినియోగం ఎన్నికల నిధుల్లో చేరి ఉన్న నల్లధనాన్ని తగ్గించడంలో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. అమిత్ షా చేసిన కామెంట్లపై ప్రతిపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి.