BJP MP Wedding With Singer : గాయనితో బీజేపీ ఎంపీ పెళ్లికి ముహూర్తం ఖరారు
అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీలలో ఒకరైన బీజేపీ నేత తేజస్వీ సూర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చి 24న చెన్నైకు చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్, తాను వివాహబంధంతో ఒక్కటవనున్నట్లు ఆయన ప్రకటించారు. తేజస్వి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండగా, శివశ్రీ గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా రాణిస్తున్నారు. శివశ్రీ స్కంద ప్రసాద్ సింగర్. పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని పార్ట్-2లో కన్నడ వర్షన్ లోని ఒక పాటను శివశ్రీ పాడారు. ఆమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దానికి 2లక్షల మందికిపైగా సబ్ స్కైబర్లు ఉన్నారు. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. శాస్త్ర యూనివర్శిటీ నుంచి బయో ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె గతంలో ప్రధాని నరేంద్ర మోదీచే మనన్నలు పొందారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో 2014 సంవత్సరంలో శివశ్రీ ఆలపించిన ఒక పాట అద్భుతంగా ఉందని మోదీ ప్రసంశించారు. ఆ పాటలో శ్రీరాముడి గురించి శివశ్రీ అద్భుతంగా వర్ణించారు.