ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న జగదీశ్ ఇవాళ జరిగిన కాల్పుల్లో మరణించినట్లు ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. ఆయన తలపై రూ. రూ.25 లక్షల రివార్డు ఉందన్నారు. జగదీశ్ ఛత్తీస్‌గఢ్‌లోని జీరామ్ లోయలో 2013న 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హత్య చేసి మారణహోమం సృష్టించిన కేసులో, 2023లో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందిన దంతేవాడ పేలుడులో సూత్రధారిగా ఉన్నారని చెప్పారు. కెర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.