Rajnath Singh: భారత సైన్యానికి ఆయుధాలు అందజేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్..
Rajnath Singh: చైనాకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది భారత్. ఇందు కనుగుణంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.;
Rajnath Singh: చైనాకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది భారత్. ఇందు కనుగుణంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. పాంగాంగ్ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటుతో సహా మరికొన్ని ఆయుధాలను సైన్యానికి అందజేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ బోటు ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు.
దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందంటున్నారు ఆర్మీ అధికారులు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు. ఇక సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను నిశితంగా పరిశీలించేందుకు.. దేశీయంగా తయారు చేసిన డ్రోన్ వ్యవస్థ కూడా భారత అమ్ములపొదిలో చేరింది. ఈ నిఘా డ్రోన్ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలదు. దీంతో భారత్ బలం మరింత పెరగనుంది. వీటితో పాటు భారత సైనికులకు F-INSAS వ్యవస్థకు సంబంధించిన AK-203 అసాల్ట్ రైఫిల్స్‌ను సైతం అంద జేశారు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్.