మధ్యంతర బెయిల్ గడువును జూన్ 7 వరకు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీఈటీ-సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షల కోసం ఆయన గడువు కోరినట్లు ఆప్ పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా, జూన్ 1వరకు ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.