Delhi : ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు .. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ఆఫ్ ఇండియా ఇవాళ విడుదల చేసింది. 70 శా సనసభ స్థానాలున్న హస్తినకు ఒకే దశలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ను ప్రకటించనుంది. ఢిల్లీలో ఉన్న మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్ల కోసం 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను అందు బాటులో ఉంచింది. 85 ఏండ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపా యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 23తో ముగియనుంది. ఈవీఎం ల ను ఎవరూ ట్యాంపర్ చేయలేరని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల్లో ట్రోజన్ హార్స్, బగ్స్ కు పంపించలేరని క్లారిటీ ఇచ్చారు. అనుమానంతో బ్యాలెట్ కే మొగ్గుచూపితే తిరోగమనం వైపు వెళ్లడ మేనని నొక్కిచెప్పారు. . మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా తనకిదే చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒక ఎలక్షన్ సైకిల్ పూర్తిచేసుకున్నానని తెలిపారు.